
ధరల మోత
నూజివీడు: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ అందుబాటులో ఉన్న ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కిలో రూ.20 ఉన్న ధరలు రూ.40, రూ.60 వరకు పెరిగాయి. రైతు బజారులో ధరలకు మించి బహిరంగ మార్కెట్‌లో, గ్రామాలు, మండల కేంద్రాల్లో ధరలు ఉంటున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగ్గా.. తా జాగా కూరగాయల వంతు అయ్యింది. కోడిగుడ్డు ధర కూడా పెరుగుతోంది. రిటైల్ మార్కెట్‌లో ఒకటి రూ.7, అట్ట రూ.200కు అమ్ముతున్నారు. సొరకాయ ఒకటీ రూ.25కు విక్రయిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వెజ్‘ట్రబుల్స్’
నూజివీడు మార్కెట్‌లో ధరలు (కిలో)
రైతుబజారు బహిరంగ మార్కెట్
టమోటా 48 60
బెండ 34 45
బీర 40 50
దొండ 36 45
గోరుచిక్కుడు 37 45
పచ్చిమిర్చి 62 75
కంద 50 60
క్యారెట్ 48 60
చేమదుంప 35 45
పొట్లకాయ (ఒకటి) 20 30