స్వాతంత్య్ర దినోత్సవాలకు పక్కా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దినోత్సవాలకు పక్కా ఏర్పాట్లు

Aug 1 2025 11:50 AM | Updated on Aug 1 2025 2:31 PM

జేసీ ధాత్రిరెడ్డి

ఏలూరు(మెట్రో) : జిల్లాలో ఈనెల 15న జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ప టిష్ట ఏర్పాట్లు చే యాలని జేసీ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ను సుందరంగా తీర్చిదిద్దాలని, సిట్టింగ్‌ ఏర్పాట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి పేర్లను ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సీపీఓ వాసుదేవరావు, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ కార్యదర్శిగా చిన్న షావుకారు

ముసునూరు : వైఎస్సార్‌ సీపీ జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శిగా చెక్కపల్లికి చెందిన సీనియర్‌ నేత తల్లిబోయిన వెంకటేశ్వరరా వు (చిన్న షావుకారు) నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావుకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానన్నారు.

రేపు డీడీఆర్‌సీ సమావేశం

ఏలూరు(మెట్రో) : ఏలూరు కలెక్టరేట్‌లో శనివా రం జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డీడీఆర్‌సీ) సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా ఇన్‌ చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉపాధి హామీ, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల పనుల ప్రగతిపై సమీక్షిస్తారు.

ఉపాధ్యాయులకు అన్యాయం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యారంగంలో ప్రభు త్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కమిటీ కన్వీనర్‌ గుగులోతు కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకు మాత్రమే ఎంఈఓ, డీవైఈఓలుగా బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వ ఉపాధ్యాయుల పెత్త నం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సంబంధించి 72, 73, 74 జీఓల అమలులో పక్షపాత వైఖరి సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయా లని డిమాండ్‌ చేశారు.

పీ4పై సమీక్ష

ఏలూరు(మెట్రో): పీ4 కార్యక్రమంలో మార్గదర్శులు స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యే లా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్‌ ఆదాయంలో ఫస్ట్‌

నూజివీడు: జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా రూ.548.80 కోట్ల రెవెన్యూతో రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించినట్టు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నూజివీడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నూజివీడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం 80 శాతం వృద్ధి సాధించిందన్నారు. రిజిస్ట్రేషన్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కార్డ్‌ ప్రైమ్‌ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్‌ జరిగిన రోజే డాక్యుమెంట్‌ను యజమానికి అందిస్తున్నామన్నారు. 

ఆగస్టు 1 నుంచి రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ కాపీని యజమానికి వాట్సాప్‌ ద్వారా అందిస్తామన్నారు. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కార్డ్‌ ప్రైమ్‌ 2.0ను మున్సిపల్‌ పరిపాలన విభాగంతో అనుసంధానం చేసి, అర్బన్‌ పరిధిలో ఉన్న ఆస్తులను మ్యూటేషన్‌ చేసి యజమాని మార్పిడి జరుగుతుందన్నారు. ఏలూరు మున్సిపాలిటీకి అనుసంధానంగా ఉన్న ఏలూరు, వట్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవాలకు పక్కా ఏర్పాట్లు 1
1/1

స్వాతంత్య్ర దినోత్సవాలకు పక్కా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement