ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని స్వామి వారి నిత్యకల్యాణ మండపంలో సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహించారు. ముందుగా తొళక్క వాహనంపై సీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులకు విశేష పుష్పాలంకారాలు చేసి ఆలయ ప్రధాన రాజగోపురం, క్షేత్ర పురవీధుల మీదుగా నిత్య కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. మండపంలో చిన వెంకన్న, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లతో పాటు మరో రజిత సింహాసనంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. రాత్రి తొళక్క వాహనంపై సీతారాముల గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది. అలాగే జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
– ద్వారకాతిరుమల
రమణీయం.. రాములోరికల్యాణం
రమణీయం.. రాములోరికల్యాణం
రమణీయం.. రాములోరికల్యాణం
రమణీయం.. రాములోరికల్యాణం
రమణీయం.. రాములోరికల్యాణం


