జాక్ చిత్ర బృందం సందడి
భీమవరం: భీమవరం విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జాక్ చిత్ర బృందం శనివారం రాత్రి సందడి చేసింది. హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది.
నేడు క్షీరారామలింగేశ్వరస్వామి కల్యాణం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివార్ల కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామిని పెండ్లి కుమారుడిని చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్మిప్రతిష్ఠాపన, బలిహరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి 5.05 గంటలకు (తెల్లవారితే మంగళవారం) స్వామి వారి కల్యాణం జరగనుంది. మద్యాహ్నం 3 గంటలకు రథోత్సవం నిర్వహంచనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న, ఇ.సూరిబాబు, ఆలయ ప్రధానార్చకులు కిష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
జాక్ చిత్ర బృందం సందడి
జాక్ చిత్ర బృందం సందడి


