గోవిందకుంట చెరువులో మట్టి దందా
ద్వారకాతిరుమల: స్థానిక పంచాయతీకి చెందిన గోవిందకుంట చెరువులో మట్టి అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు రాత్రీపగలూ తేడా లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్నారు. ప్రధానంగా జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు తవ్వకాలు జరుపుతూ కొందరు కూ టమి నేతలకు ట్రాక్టర్‌కు ఇంతని ముట్టచెబుతున్నట్టు సమాచారం. దూరాన్ని బట్టి ట్రాక్టర్ మట్టిని రూ.700 నుంచి రూ.900కి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వైపు నుంచే మట్టి ట్రాక్టర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు గట్టును సైతం అక్రమార్కులు తవ్వేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేద ని స్థానికులు అంటున్నారు.
నేడు పాఠశాలలకు సెలవు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. అలాగే ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సెలవు అని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు పాటించని యాజమాన్యాలపై చ ర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు స్లాట్ బుకింగ్ విధానంలో 16 రిజిస్ట్రేషన్లు చేసినట్టు జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నామని, త్వరలో అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తామన్నారు. స్లాట్ బుకింగ్ సమయంలోనే చలానాలు అప్‌లోడ్ చేయా ల్సి ఉంటుందని, స్లాట్ బుక్ చేసుకున్న వారు సమయానికి అందుబాటులోకి రాలేకపోతే రూ.200 అదనంగా చెల్లించి తమ స్లాట్‌ను రీ షెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపారు. ఏలూరు స బ్ రిజిస్ట్రార్–2 రామకృష్ణ, సతీష్ పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్‌కు 250 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జేఈఈ మె యిన్స్ సెషన్–2 పరీక్షలకు 250 మంది విద్యా ర్థులు హాజరయ్యారు. ఉదయం షిఫ్టులో 115 మందికి 106 మంది, మధ్యాహ్నం షిఫ్టులో 152 మందికి 144 మంది హాజరయ్యారని సిటీ కో–ఆర్డినేటర్ పి.సాయికుమారి తెలిపారు.
కోకో రైతులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజల కొనుగో లు, ధర సమస్యలపై కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. ఏలూరు లోని అన్నేభవనంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌర వాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఈనెల 7 వరకు ఎదురు చూస్తామని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులు అబద్ధాలు వల్లించడం దుర్మార్గమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజల ధర రూ.750 ఉండగా కంపెనీలు మాత్రం రూ.450 నుంచి రూ.550కే కొనుగోలు చేస్తున్నాయన్నారు. అన్ సీజన్ గింజలు కొనడం లేదన్నారు. అంతర్జాతీయ మా ర్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
గోవిందకుంట చెరువులో మట్టి దందా


