మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం | - | Sakshi
Sakshi News home page

మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

ఎటపాక: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో ఆంధ్యా వ్యాయామ ఉపాధ్యాయుడు స్వర్ణ పతకం సాధించారు. తెలంగాణ, నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అఫ్‌ ఇండియా, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ గుర్తింపుతో సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో 35–90 ఏళ్ల మధ్య వయస్సు పురుషులు, మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఎటపాక మండలం నల్లకుంట ఆశ్రమ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సొడె నాగిరెడ్డి 45 ఏళ్ల విభాగం షాట్‌పుట్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఆయనను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement