అన్నపూర్ణమ్మకు వెండి మకర తోరణం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణమ్మకు వెండి మకర తోరణం సమర్పణ

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

పెద్దాపురం: స్థానిక విశ్వేశ్వర చంద్రశేఖర స్వామి దేవస్థానంలోని అన్నపూర్ణ అమ్మవారికి పెద్దాపురానికి చెందిన భక్తులు రూ.10 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని ఆదివారం సమర్పించారు. పట్టణానికి చెందిన యినుమర్తి సత్యనారాయణ, వీరవెంకట పద్మావతి దంపతులు ఈవో కె.జగదీఽశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో అమ్మవారికి వెండి మకరతోరణాన్ని అందజేశారు.

జాతీయ రహదారిపై

లారీ బోల్తా

డ్రైవర్‌ నిద్ర మత్తుతో ఘటన

రాజానగరం: జాతీయ రహదారిపై జీపీఆర్‌ గార్డెన్స్‌ వద్ద సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ ఆదివారం తిరగబడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి కాకినాడకు ఆ లారీ లూజ్‌ సిమెంటు తీసుకువెళ్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్రకు చెందిన డ్రైవర్‌ కేతా శ్రీనివాస్‌ నిద్రమత్తలో షడన్‌ బ్రేక్‌ వేయడంతో లారీ అదుపుతప్పి, రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మలు, చెట్లపై నుంచి పల్టీ కొట్టింది. ఈ ఘటనకు కొద్దివేటు దూరంలోనే ఉన్న ఒక కారు, చిన్నపాటి హోటల్‌ నిర్వాహకులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్రకాలనీలో చోరీ

రూ.3.5 లక్షల నగదు

బంగారు, వెండి ఆభరణాల అపహరణ

కడియం: మండలంలోని దుళ్ల గ్రామంలోని ఎర్ర కాలనీలో ఆదివారం ఓ ఇంటిలో చోరీ జరిగి రూ.3.5 లక్షల నగదు, 10 కాసుల బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి యజమాని మానెం సత్యనారాయణ కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం వేములపల్లి ఫంక్షన్‌కు వెళ్లారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఒక వ్యక్తి ఇంటిలోకి చొరబడి బీరువాలోని నగదు, బంగారు, వెండి వస్తువులను చోరీ చేసినట్టు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సౌత్‌జోన్‌ డీఎస్పీ శివప్రియ, ఎస్సై దుర్గాప్రసాద్‌ పరిశీలించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement