తుని రూరల్: తలుపులమ్మ తల్లి దర్శనానికి వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన పది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.1,36,615, పూజా టికెట్లకు రూ.2,39,780, కేశ ఖండనశాలకు రూ.12,720, వాహన పూజలు, ఇతర సేవలకు రూ.13,340, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.50,670, విరాళాలు రూ.37,192, వేదాశీర్వచనములు రూ.9,486, వెరసి మొత్తం రూ.5,01,803 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.


