● కనుమురుగు | - | Sakshi
Sakshi News home page

● కనుమురుగు

Jun 25 2026 9:33 AM | Updated on Jun 25 2026 9:33 AM

ఆపొద చూడండి

అడ్డతీగల – ఏలేశ్వరం ప్రధాన రోడ్డును వెదురు పొదలు మూసేస్తున్నాయి. రోడ్డు పక్కనే ఉన్న వెదురు పొదలు వాటికి అల్లుకుపోయిన పాదులతో ప్రధాన రోడ్డుపై వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. బొంగరాలపాడు సమీపాన శివాలయం వద్ద ఇలా వెదురు పొదలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. సంబందిత అధికారులు కాస్త చూడాలి.

– అడ్డతీగల

కాళ్ల కింద కరకర

ఆ దారిలో వెళ్తే కాళ్ల కింద కరకరలాడుతోంది. రాజవొమ్మంగి మండలం బూరుగపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా రూ. 2.5 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు గతంలో మంజూరు అయ్యాయి. కాంట్రాక్టర్‌ గ్రావెల్‌, మెటల్‌ పరిచి, కొంతమేర బిల్లులు తీసుకుని పత్తాలేకుండా పోయారు. దీనిని పూర్తి చేయించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంది.

– రాజవొమ్మంగి

మండపేట రాజారత్న సెంటర్‌లో గల డ్రెయిన్‌లోని పూడిక తీసేందుకు ఓ కార్మికుడు పీకల్లోతు దిగి పనులు చేస్తున్నాడు. అతడికి మరో ఇద్దరు కార్మికులు సాయం చేస్తున్నారు. ఆధునిక కాలంలో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చినా, ఇంకా ఇలాంటి పనులు మనుషులతో చేయించడం దారుణం. పాలకుల తీరుతో మానవత్వం కనుమరుగు అవుతోందనిపిస్తోంది.

– కపిలేశ్వరపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement