పాలిసెట్‌కు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు డిమాండ్‌

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

ఉమ్మడి జిల్లాలో

23,980 మంది దరఖాస్తు

25న 71 కేంద్రాల్లో పరీక్ష

రాయవరం: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్‌–2026 ఈ నెల 25న నిర్వహించనున్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. గతేడాదితో పోలిస్తే దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23,980 మంది దరఖాస్తు చేయగా, వీరి కోసం 71 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పెరిగిన

దరఖాస్తులు

పాలిసెట్‌–2026కు గతేడాదితో పోలిస్తే దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా పోలిస్తే 15 శాతం దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలో తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరు, అనపర్తి, కాకినాడ జిల్లాలో కాకినాడలో రెండు, పిఠాపురం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామ, పోలవరం జిల్లాలో రంపచోడవరం, ఎటపాకలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేట్‌ యాజమాన్యంలో 10 వరకు పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కంప్యూటర్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. కొన్నేళ్లుగా 80 శాతం వరకు సీట్లు భర్తీ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది విద్యార్థుల నుంచి దరఖాస్తుల రూపంలో మంచి స్పందన ఉండడంతో 100 శాతం సీట్లు భర్తీ అవుతాయని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాలు భావిస్తున్నాయి.

గంట ముందుగానే ప్రవేశం

ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌, బాల్‌ పాయింట్‌ పెన్ను, హెచ్‌బీ పెన్సిల్‌, ఎరేజర్‌, షార్ప్‌నర్‌ వెంట తీసుకుని వెళ్లాలి. సెల్‌ఫోన్‌, కాలిక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు.

పదవ తరగతి విద్యార్థులు

పట్టణం పరీక్షా వచ్చిన

కేంద్రాలు దరఖాస్తులు

ఎటపాక 02 236

చింతూరు 01 241

రంపచోడవరం 02 405

కాకినాడ 18 5.855

సామర్లకోట 04 743

పెద్దాపురం 05 1,411

పిఠాపురం 05 1,786

తుని 04 1,489

రాజమహేంద్రవరం 12 5,292

ముక్తేశ్వరం 01 366

మండపేట 04 975

రామచంద్రపురం 03 1,161

అమలాపురం 07 3,185

నిడదవోలు 03 835

మౌలిక వసతులకు ప్రాధాన్యం

పరీక్షా కేంద్రాల ఆవరణలో తాగునీరు, విద్యుత్తు, వైద్య సేవలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చాం.

– అక్కుల మురళి, పాలిసెట్‌–2026 తూర్పుగోదావరి జిల్లా కో–ఆర్డినేటర్‌, రాజమహేంద్రవరం.

Advertisement
 
Advertisement
Advertisement