అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం సోమవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. సింహాచలం చందనోత్సవానికి వెళ్లిన భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శనానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల క్యూ లు, వ్రత మండపాలు జనంతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి.
మహిళను స్వదేశానికి రప్పించిన కేసీఎం
అమలాపురం రూరల్: ఖతర్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యానాం ప్రాంత దరియాల తిప్పకు చెందిన దండుప్రోలు వీరవేణిని కలెక్టర్ చొరవతో కోనసీమ వలస దారుల కేంద్రం (కేసీఎం) సురక్షితంగా ఇంటికి రప్పించింది. వివరాల్లోకి వెళ్ళితే ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన ఏజెంట్ పి.ఆదినారాయణ ద్వారా నాగలక్ష్మి (వీరవేణి) 2025 మార్చిలో ఉపాధి కోసం ఖతర్ వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో పనికి చేరిన ఆమెను ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే సౌదీ అరేబియాకు తరలించారు. బాధితురాలు యజమానుల నుంచి తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నారు. కనీసం తినడానికి సరైన ఆహారం అందించకపోవడం, నిరాశ, పని ఒత్తిడి భరించలేక మిమ్మల్ని మళ్లీ చూడలేనేమో.. ఇక్కడే చనిపోతానేమో అని కుటుంబ సభ్యుల వద్ద విలపించింది. బాధితురాలి దీనస్థితిని తెలుసుకున్న కుటుంబ సభ్యులు లెక్టర్‌ను కలిసి వేడుకోగా ఆయన స్పందించారు. కేసీఎం బృందం ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపి ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని వచ్చామని కేంద్ర సమన్వయ అధికారి జి రమేష్ తెలిపారు.


