ఏటా పచ్చళ్లు పెట్టుకునే వారు గతంలో ఇళ్ల వద్దే ముక్కలు కోసుకునే వారు. కోత సరిగ్గా లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. అందుకే మా దగ్గర ముక్కలు కొట్టిస్తున్నారు. మామిడి కాయల సీజన్ వచ్చిందంటే మాకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా మామిడి కాయలను ముక్కలుగా కొడుతూంటాం. మామూలు రోజుల్లో వెదురు బుట్టలు అల్లుకునే మాకు ఈ సీజన్‌లో మామిడి కాయలు కొట్టే పనే పొట్ట నింపుతుంది. – పిల్లి లక్ష్మి, పిఠాపురం
ఇక నుంచి ఖాళీ ఉండదు
వారం రోజులుగా మామిడి కాయ ముక్కలు కోయడం ప్రారంభమైంది. మామిడి పండ్లు వచ్చేంత వరకూ రోజూ ఈ పని ఉంటుంది. మాతో పాటు చాలా మంది ముక్కలు కోసే పనిలో ఉన్నారు. ప్రత్యేకమైన కత్తులతో ఎక్కడా ముక్క దెబ్బ తినకుండా, పీచు విడిపోకుండా కోయాల్సి ఉంటుంది. ఈ పని మాకు అలవాటు కాబట్టి మా దగ్గర కోయించుకుంటారు. – పిల్లి అప్పయ్యమ్మ, పిఠాపురం


