ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు, పవన్, దుర్గేష్‌లు నిడదవోలులోని తీరుగూడెంలో ఉన్న టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని పేదలకు టిడ్కో ఇళ్లను సబ్సిడీతో బ్యాంకు్ ద్వారా కట్టించి ఇస్తామని చెప్పి ప్రారంభించారు. 1,152 మందికి ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయలుదు. నేటికీ ప్లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో గృహ సముదాయాలు నిరుపయోగంగా మారాయి. ద్వారాలు, కిటికీలు, తలుపులు శిథిలావస్థకు చేరాయి. కాలనీల్లో కనీస వసతులు కరవయ్యాయి.
కలగానే వంద పడకల ఆస్పత్రి నిర్మాణం
నిడదవోలులో 30 పడకల సామర్థ్యంతో ఉన్న ఆస్పత్రిని 100 పడకలుగా అభివృద్ధి చేస్తామని గుప్పించిన హామీ సైతం అమలు కాలేదు. పైగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.19 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శంకుస్థాపన కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించారు. ఇక్కడ మంజూరైనా 100 పడకల ఆసుపత్రిని పిఠాపురానికి తరలించారని సమాచారం. నిడదవోలు ప్రభుత్వాస్పత్రిలో ప్రతి రోజూ 350 మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. నెలకు 50 వరకూ ప్రసవాలు జరుగుతున్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది.
పట్టణంలో పునాదులు వేసి వదిలేసిన మినీ స్టేడియం
కూలిపోయిన కంసాలిపాలెం–మాధవరం వంతెన
సాక్షి, రాజమహేంద్రవరం/ నిడదవోలు: ‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడిమల్లన్న’ అన్న సామెత చంద్రబాబునాయుడు, కూటమి నేతలకు అతికినట్టు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో తూర్పుగోదావవరి జిల్లా వ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. అధికారం చేజిక్కించుకునేందుకు అలవిగాని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వాటి అమలును విస్మరించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని ఎన్నికల ప్రచార సభల్లో ప్రగల్భాలు పలికిన నేతలు.. గద్దెనెక్కి రెండేళ్లయినా పట్టించుకోవడం లేదు. 2024లో నిడదవోలు పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కందుల దుర్గేష్‌లు అనేక హామీలు ఇచ్చారు. వాటిని నేటికీ నెరవేర్చలేదు. శనివారం తిరిగి నిడదవోలు పర్యటనకు సీఎం హోదాలో చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సమక్షంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
తీరని వంతెన చింతన
పట్టణంలో చినకాశిరేవు వద్ద బ్రిటిష్ హయాంలో నిర్మించిన పురాతన గడ్డర్ బ్రిడ్జి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కుప్పకూలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో గడ్డర్ బ్రిడ్జి నిర్మిస్తామన్న కూటమి నేతలు హామీ ఇచ్చారు. రెండేళ్లయినా దాని ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కై లాసగిరి ప్రాంతానికి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చినకాశిరేవులో ఉన్న 30 ఆలయాలకు వెళ్లేందుకు కీలకమైన వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ముందుకు కదలని మినీ స్టేడియం
విద్యానగర్‌లో ఉన్న మున్సిపల్ పార్కులో మినిస్టేడియం నిర్మాణానికి 2018లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు శంకుస్థాపన చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ బహిరంగ సభలో క్రీడాకారులకు మినీ స్టేడియం నిర్మిస్తామని హమీ ఇచ్చారు. దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో నిడదవోలు ప్రాంతంలో సుమారు 2,000 మంది క్రీడాకారులు నైపుణ్యాలు మెరుగుపర్చుకునే అవకాశం లేకుండా పోయింది.
నెరవేరని ప్రజల ఆకాంక్ష
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ప్రజల ఆకాంక్ష అయిన కంసాలిపాలెం– తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామాల మధ్య ఎరక్రాలువపై వంతెన నిర్మాణ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నిర్మిస్తామని ఎన్నికల సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. రెండేళ్లయినా అతీగతీ లేదు. ఎరక్రాలువ ఉధృతికి కొట్టుకుపోయింది. తర్వాత వచ్చిన వరదకు పూర్తిగా పడిపోయింది. దీంతో రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పంటలు ఇంటికి తరలించేందుకు పాట్లు పడుతున్నారు.
గొంతు తడపని గోదావరి జలాలు
అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి జలాలను పట్టణ ప్రజల చెంతకు చేరుస్తామని హామీ ఇచ్చారు. నేటికీ గొంతు తడవని పరిస్థితి ఏర్పడింది.
● పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య సైతం గాలికి వదిలేశారు.
● పెరవలి గ్రామంలో బస్టాండ్ నిర్మాణం, విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ఏటిగట్టు నిర్మాణ పనులు చేస్తామని చెప్పి ఇప్పటికి వాటి ఊసే ఎత్తడం లేదు.
నేటి సీఎం పర్యటన షెడ్యూల్
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిడదవోలులో పర్యటించనున్నారు. తాడేపల్లిలో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి నిడదవోలు ఎంవీనగర్‌లో మారుతీ లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుబ్బరాజుపేట ప్రజావేదిక వద్దకు ఉదయం 11.20 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 వరకు పాల్గొంటారు. 1.50 నుంచి 2.20 గంటల వరకు లయన్స్ కంటి ఆసుపత్రి సమీపంలో ఉన్న మాలకోడు చెరువు ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశానికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4.05 గంటలకు ఎంవీనగర్ మారుతీ లేవుట్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు ఉండవల్లి నివాసానికి వెళతారు.
సార్వత్రిక ఎన్నికల వేళ పలు
హామీలు గుప్పించిన కూటమి నేతలు
అధికారం చేపట్టి రెండేళ్లయినా
నేటికీ నెరవేరని వైనం
మంత్రి కందుల దుర్గేష్
ఇలాకాలో తిష్ట వేసిన సమస్యలు
100 పడకల ఆసుపత్రి ఊసేలేదు
టిడ్కో ఇళ్ల కోసం నిరీక్షణ
కంసాలిపాలెం–మాధవరం
వంతెనకు తప్పని చింత
చినకాశిరేవులో పురాతన వంతెన నిర్మాణం ఎండమావేనా?
ఇంకెన్నాళ్లు నిరీక్షించాలి ?
రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు మావి. అప్పులు చేసి తిప్పలు పడుతున్నాం. ఓ పక్క నెలకు రూ.5 వేలు వడ్డీ చెల్లిస్తున్నాం. మరోపక్క రూ.మూడు వేలు అద్దె ఇస్తున్నాం. నెలలో సంపాదించిన డబ్బు వీటికే పోతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఫ్లాట్లు కేటాయిస్తే అద్దె భారం తగ్గుతుంది.
– మల్లిపూడి, జ్యోతి, టిడ్కో లబ్ధిదారు, నిడదవోలు
క్రీడలకు అవకాశం కల్పించాలి
పట్టణంలో మినీ స్టేడియం నిర్మించి క్రీడలను మరింత ప్రొత్సహించాలి. షటిల్, బాడ్మింటన్, త్రోబాల్, బాస్కెట్‌బాల్ వంటి ఇండోర్ క్రీడలను ఆడుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు. మినీ స్టేడియం నిర్మిస్తే మా లాంటి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉంటాయి.
– పంతుల కార్తీక్, త్రో బాల్ క్రీడాకారుడు, నిడదవోలు


