● గతంలోనే 50 శాతం
రిజర్వేషన్లు అమలు చేశారు
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
(పార్లమెంట్) షర్మిలారెడ్డి
సీటీఆర్‌ఐ: మహిళా రిజర్వేషన్లకు నిజమైన టార్చ్ బేరర్ (మార్గదర్శి) మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా శుక్రవారం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారత అంటే కేవలం నినాదం కాదు ఆచరణలో చూపించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మహిళలకు నిజమైన అధికారం ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేశారన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశాలు కల్పించారన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మహిళను హోం మంత్రిగా నియమించారని అదే పంథాను నేడు చంద్రబాబు కూడా కొనసాగిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మహిళా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు సంక్షేమ పథకాలు జగన్‌అందజేశారన్నారు. తల్లులకు నేరుగా ఆర్థిక సాయం అందించేవిధంగా అమ్మ ఒడి, స్వయం సహాయక సంఘాల బలపరడం కోసం వైఎస్సార్ ఆసరా, చిరువ్యాపారరులకు మద్దతుగా వైఎస్సార్ చేదోడు, అందచేసి ప్రపంచానికి దిశానిర్దేశం చేశారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిలును స్వాగతిస్తున్నామన్నారు. అయితే జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 50 శాతం అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు.


