అమలాపురం టౌన్: భారత ప్రభుత్వం కోల్‌కతా మింట్ ద్వారా సేవా తీర్థ రూ.100 స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేసింది. ఈ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఢిల్లీలోని సేవా తీర్థ కాంప్లెక్స్ గౌరవార్థం ఈ నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణెం ద్వారా కోల్‌కతా మింట్ 200 ఏళ్ల పైబడి ఉన్న తన చరిత్రలో తొలిసారిగా ’కె’ మార్కుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకూ కోల్‌కతా మింట్ ముద్రించిన నాణేలపై ఎలాంటి మార్కును ముద్రించలేదు. ఈ నాణెంపై మాత్రం కోల్‌కతాను సూచిస్తూ ‘కె’ మింట్ మార్కును ముద్రించింది. నాణేనికి ఓ వైపు అశోక స్తంభం, సత్యమేవ జయ తే అని ఉండగా, మరోవైపు కొత్తగా ని ర్మించిన సేవా తీర్థ కాంప్లెక్స్ చిత్రం ఉంది. అలాగే నాణెం దిగువ అంచున ‘నాగరిక్ దేవోభవ’ అనే నినాదాన్ని కూడా ముద్రించారు. సేవా తీర్థ అనేది కేవలం ఒక భవనం మాత్రమే కాదని, అది భార త ప్రభుత్వ సేవా దృక్పథానికి చిహ్న మని నాణెం తెలియచెబుతోంది. నికెల్ సిల్వర్‌లో ఈ నాణెం విడుదలైంది.


