రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ పిలుపునిచ్చారు. అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వివిధ విభాగాల్లో పలు హోదాల్లో నియమితులైన వారికి పార్టీ కార్యాలయంలో గురువారం నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ, పార్టీని కింది స్థాయి నుంచీ బలోపేతం చేసి, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదవులు పొందిన వారు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేసి పార్టీ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సేపేని మునీశ్వరరావును, వైఎస్సార్ టీయూసీ సిటీ ప్రెసిడెంట్ దాది గౌరీశంకర్, ఆరో డివిజన్ అధ్యక్షుడు నల్ల రామాంజనేయులు, 24వ డివిజన్ అధ్యక్షుడు ఎజ్జవరపు శ్రీనివాసరావు, 25వ డివిజన్ అధ్యక్షుడు రొక్కం త్రినాథ్, 50వ డివిజన్ అధ్యక్షురాలు గుత్తుల కోటేశ్వరిలను శాలువాలతో భరత్‌రామ్ ఘనంగా సత్కరించారు.


