గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

సామర్లకోట: పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం రైల్వే పోలీసులు వివరాలు తెలిపారు. 2025 అక్టోబర్‌ 24న టాటానగర్‌–యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా అవుతున్న సమాచారం తెలుసుకొని రైల్వే పోలీసులు దాడి చేసి 154 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరుణంలో గంజాయి రవాణా చేస్తున్న అరవింద్‌ పరార్‌ అయ్యాడు. దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం డీఎస్పీ జయ రాంప్రసాద్‌ కాకినాడ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిందితుని పట్టుకొనేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడు కర్ణాటకలో ఉన్నట్లు తెలుసుకొని కాకినాడ ఎస్సై సత్తిబాబు, హెచ్‌సీ శ్యామ్‌ త్రినాథరావు, పీసీ చంద్రశేఖర్‌, మధులను అక్కడకు పంపారు. నిందితుడిని మాండ్య జిల్లాలో అరెస్టు చేసి రైల్వే కోర్టులో ప్రవేశ పెట్టగా రైల్వే మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు పంపారని ఎస్సై సత్తిబాబు తెలిపారు. నిందితునిపై రాజమహేంద్రవరం, సామర్లకోట జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసులు ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement