సీబీఎస్‌ఈ ఫలితాలలో షిర్డీసాయి హవా | - | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ ఫలితాలలో షిర్డీసాయి హవా

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదవ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాలలో తమ విద్యార్థులు 100 శాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్టు శ్రీ షిర్డీసాయి విద్యా సంస్థల డైరెక్టర్‌ టి. శ్రీవిద్య గురువారం తెలిపారు. జి.అంజలి ప్రణయ 486 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుందని తెలిపారు. ఎం.శ్రీయుక్త, ఎన్‌.శ్రీలాస్య 483 మార్కులతో ద్వితీయ స్థానం, ఎ.దివేష్‌ 481 మార్కులతో తృతీయస్థానాన్ని సాధించారన్నారు. నలుగురు విద్యార్థులు 480 పైగా మార్కులు, 7 మంది 470 పైగా మార్కులు, 26 మంది 460 పైగా, 47 మంది 450 పైగా మార్కులు సాధించగా 142 మంది 400 పైగా మార్కులు సాధించారని శ్రీవిద్య తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని విద్యాసంస్థల చైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement