సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా గత 21 రోజులకు గాను 1,02,43,731 ఆదాయం వచ్చింది. దేవస్థానంలోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. నగదు రూ.96,43,314 రాగా, చిల్లర నాణేలు రూ.6,00,417 వచ్చాయని ఆలయ చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్య చక్రధర్‌రావు తెలిపారు. వీటితో బాటు బంగారం 26.5 గ్రాములు, వెండి 280 గ్రాములు వచ్చినట్టు చెప్పారు. రోజుకి సగటున రూ.4,87,796 హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అమెరికా డాలర్లు రెండు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీనార్లు 15, ఒమెన్‌ బైసా వంద, ఇంగ్లాండ్‌ పౌండ్లు ఐదు, మలేషియా రింగిట్స్‌ ఐదు, డెన్మార్స్‌ క్రోనార్స్‌ వంద లభించాయని తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement