తమిళనాడులో గోకివాడ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

తమిళనాడులో గోకివాడ యువకుడి మృతి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

పిఠాపురం రూరల్‌: మండలం గోకివాడకు చెందిన మలిరెడ్డి సూర్యనారాయణ (27) తమిళనాడులో మృతి చెందాడు. విల్లుపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో అతడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు అక్కడి రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. డిగ్రీ చదివిన సూర్యనారాయణ ఉద్యోగం నిమిత్తం పదిరోజుల క్రితం చైన్నె వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. వీర్రాజు, సత్యవేణి దంపతుల ముగ్గురు కుమారుల్లో రెండో సంతానం సత్యనారాయణ.

శ్రీ చైతన్య విద్యార్థుల

విజయభేరి

రాజమహేంద్రవరం సిటీ: ఇంటర్మీడియెట్‌ పరీక్షల ఫలితాల్లో స్థానిక శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజ్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఏజీఎం ఎం.హరి ప్రసాద్‌ తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 467 మార్కులు సాధించిన ముత్తుర్తి అజయ్‌ లక్ష్మణ్‌ రాజమహేంద్రవరం టౌన్‌ ఫస్ట్‌ మార్కుగా, స్టేట్‌ థర్డ్‌ మార్క్‌గా నిలిచాడు. అలాగే 466 మార్కులతో ఇద్దరు విద్యార్థులు పంపన జ్ఞాన భాగ్య లక్ష్మీ సౌజన్య, కాలెపు సుష్మా సాయి విజేతలుగా నిలిచారు. ఏడుగురు విద్యాఽర్థులు 465 మార్కులు, 14 మంది 464, 12 మంది 463, 10 మంది 462, 13 మంది 461, 16 మంది 460, 75 మంది 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్‌ బైపీసీ విభాగంలో ఎల్లెన్‌ జాయ్‌ 455 మార్కులకు 450 సాధించి స్టేట్‌ థర్డ్‌ ర్యాంకర్‌గా నిలిచాడన్నారు. ముగ్గురు 449, ఒకరు 448, ఇద్దరు 447 సాధించారన్నారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో లాస్య శ్రీ సాయి 991 మార్కులు సాధించగా 22 మందికి 980 మార్కులు దాటి వచ్చాయన్నారు. సీనియర్‌ బైపీసీలో ఇద్దరు 991, మార్కులు సాధించగా 16 మంది 980 మార్కులు దాటి విజయం సాధించారన్నారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందలు తెలిపారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో

‘లక్ష్య’ ఘనత

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల డైరెక్టర్‌ నల్లమిల్లి సుగుణారెడ్డి బుధవారం తెలిపారు. ఫలితాల్లో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రిహాన్‌ సన (97.6 శాతం) సాధించి స్కూల్‌ టాపర్‌గా నిలిచారన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి చదవుతో పాటు జీవన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్‌ చాలా అవసరమన్నారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్‌ వందన బోహ్రా తదితరులు అభినందించారు.

శ్రీ ప్రకాష్‌ విద్యార్థుల ప్రతిభ

బాలాజీచెరువు: సీబీఎస్‌ఈ ఫలితాల్లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎంవీవీఎస్‌ మూర్తి తెలిపారు. విద్యార్థులు ఎం.హాసిని 482, ఎంఎస్‌వీ సాత్విక్‌ 482, ఎ.రిషితారెడ్డి 481, సీహెచ్‌ విజయదుర్గ 478, ఎన్‌.శర్వన్‌ రాకేష్‌ 477, పి.భానుప్రతాప్‌ 477 మార్కులు సాధించారన్నారు. నూటికి నూరుశాతం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి పాఠశాల ఘనత పెంచారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్‌ విజయప్రకాష్‌ అభినందించారు.

ఇంటర్‌ ఫలితాలలో

శశి విజయభేరి

నిడదవోలు: 2026 ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారని వేలివెన్ను శశి విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు బి.ఘర్మా నాయక్‌, వీఎస్‌వీ సాత్విక్‌, జె.లాస్య, ఐ.నాగకీర్తి, ఏసీహెచ్‌ శ్రీసత్య వివేక్‌, ఎ.విజయలక్ష్మి, సీహెచ్‌ తేజశ్రీ 467 మార్కుల చొప్పున సాధించారు. జూనియర్‌ ఇంటర్‌ బైపీసీలో 455 మార్కులకు యస్‌. నందిని, ఎంఎల్‌ఎస్‌ లక్ష్మీ లిఖిత, హెచ్‌. తరణిదేవి 451 చొప్పున, పి.జానూష 450 మార్కులు, కేబీ శ్రీపావని, యన్‌. దేవి 450 మార్కుల చొప్పున, 465 పైన 58 మంది, 460 పైన 318, 430 పైన 1175 మంది, 400 పైన 1572 మంది సాధించారని ఆయన తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు వై.రాహుల్‌ 992, వై. పురంధేశ్వర రెడ్డి, కెబీఎస్‌ వెంకట ఆచారి, సీహెచ్‌ఆర్‌ఎస్‌ సుమశ్రీ, యం.నవ్యశ్రీ 991 చొప్పున సాధించారు. సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో వెయ్యి మార్కులకు యస్‌. స్వర్ణాంజలి, పి.అమృత, ఎఎన్‌ వాసవి అలేఖ్య 990 చొప్పున, 990 పైన 25 మంది, 980 పైన 337 మంది, 950 పైన 972 మంది, 900 పైన 1496 మంది సాధించారని ఆయన తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement