ఇంటర్‌ ఫలితాల్లో ‘ప్రగతి’ జయభేరి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో ‘ప్రగతి’ జయభేరి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ప్రగతి విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్‌ నూతలపాటి పూర్ణచంద్రరావు బుధవారం తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో పీఎస్‌డీయూ మాధవి షర్మిల 470కి 466, మట్టి స్వప్నిక 465, పైల మహేశ్వరి 465, వాసంశెట్టి హర్షిత 465, బొజ్జ మాన్యశ్రీ 465 మార్కులు సాధించారన్నారు. జూనియర్‌ బైపీసీలో 455కి చిట్టూరి మేఘన 450, తూరంగి హాసిని 450, సీఈసీలో ఎస్‌.పూజిత శ్రీదుర్గ 493, కొల్లు సత్యతేజ 490 మార్కులు సాధించారన్నారు. సీనియర్‌ ఎంపీసీలో ఆర్‌ఎల్‌డీఎన్‌ గాయత్రి 989 మార్కులు, పిల్లా హర్షిణి 989, వంకా స్వరూప్‌బాబు 989, జీఎం శ్రీదుర్గ 989, బైపీసీలో ఫాజీలా ఖురేషిబేగం 989 సాధించారన్నారు. వీటితో పాటు జూనియర్‌ ఎంపీసీలో 460కు పైగా 60 మంది, జూనియర్‌ బైపీసీలో 440కు పైగా 15 మంది మార్కులు సాధించారన్నారు. కాకినాడ, పెద్దాపురం, జగపతినగరం, రాజమండ్రి బ్రాంచ్‌లలో నూరుశాతం ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను ప్రగతి డైరెక్టర్లు హిమబిందు, శ్వేతబిందు, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement