రాజమహేంద్రవరం సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో శ్రీ షిర్డీసాయి విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి జయ కేతనం ఎగురవేసినట్లు షిర్డీసాయి విద్యా సంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. ప్రధమ సంవత్సరం ఎంపీసీలో కె.అక్షయ, కె.పావని, జి.సౌమ్య, జి.పాల్, షణ్ముఖ శ్రీ, సాన్వి ప్రియ, ప్రతీష్, సాహితి, ఐశ్వర్య, దీపక్, ప్రజ్ఞ 11 మంది 470 మార్కులకు 465 సాధించి ప్రధమ స్థానం కై వసం చేసుకోగా, 17 మంది 464 మార్కులు, 22 మంది 463, 35 మంది 462, 43 మంది 461, 65 మంది 460, 116 మంది 450, 220 మంది 400 మార్కులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కె.ప్రవల్లిక, ఎన్.లలిత 989 మార్కులతో ప్రధమ స్థానం కై వసం చేసుకోగా, ఎస్.నిత్యశ్రీ, జె.చాతుర్య, వి.నిత్యశ్రీ, బ్లెస్సీ గ్లాడిస్ 988 మార్కులు సాధించారు. 19 మంది 980 మార్కులు, 50 మంది 970, 104 మంది 950, 170 మంది 900 మార్కులు సాధించారన్నారు. తమ విద్యార్థులు అత్యుత్థమ ఫలితాలతో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంపై విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను, వారి ఉత్తీర్ణతకు కృషి చెసిన అధ్యాపక బృందాన్నీ ఆయనతో పాటు డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్యా డీన్ చంద్రశేఖర్ అభినందించారు.


