రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి ఈ నెల 22వ తేదీకి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆరోజు యూనివర్సిటీలో ఆవిర్భావ దినోత్సవాన్ని 20 రకాల థీమ్స్‌తో నిర్వహించదలచామని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ 20 థీమ్స్‌కి 20 మందిని కన్వీనర్లుగా నియమించామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ బ్రోచర్‌ను బుధవారం విడుదల చేశారు.
ముగిసిన
పది మూల్యాంకనం
ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం) : తొమ్మిది రోజులుగా స్థానిక బీవీఎమ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ బుధవారంతో ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు తెలిపారు. మొత్తం 780 మంది సిబ్బంది తమ విధులను సమర్థంగా నిర్వహించారన్నారు. 7 జిల్లాల నుంచి ఒక్కో సబ్జెక్టు చొప్పున సుమారు 1,76,032 జవాబు పత్రాలు కేంద్రానికి వచ్చాయన్నారు. చీఫ్ ఎగ్జామినర్లు 75, సహాయ ఎగ్జామినర్లు 455, సహాయకులు 221, ఇతరులు 29..మొత్తం 780మంది సిబ్బందిని నియమించామన్నారు.
ముగిసిన ఓపెన్ స్కూల్ స్పాట్
ఓపెన్ స్కూల్ స్పాట్ కూడా బుధవారంతో ముగిసిందని, మొత్తం 12,768 జవాబు పత్రాలు వచ్చాయని, చీఫ్ ఎగ్జామినర్లు 18, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 64 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 18 మంది.. ఓపెన్ స్పాట్ లో విధులు నిర్వహించారని డీఈవో తెలిపారు.
కేజీ బేసిన్ గ్యాస్, చమురు
సాధన కోసం నేడు సదస్సు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు సంహిత కన్వెషన్ హాల్‌లో కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన కోసం రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామని సీపీఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు తాటి పాక మధు, సీపీఎం జిల్లా కార్య దర్శి టి.అరుణ్ తెలిపారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ సహజ వనరులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేప్పుడు ఆ రాష్ట్రానికి పన్నులు చెల్లించాలనే సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50 శాతం దక్కాలని 12వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందన్నారు. కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన కోసం జరిగే రాష్ట్ర సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ప్రత్యేక హెూదా విభజన హామీల సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తదితర 12 మంది వక్తలు రానున్నారని తెలిపారు.
సీఎం పర్యటన
ఏర్పాట్ల పరిశీలన
నిడదవోలు: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటన ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్‌లు బుధవారం ఉన్నతాధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గాంధీనగర్ సమీపంలో ఉన్న మాలకోడు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే పనులకు, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.


