వైఎస్సార్‌ సీపీలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పలువురు నాయకులను పార్టీ పదవుల్లో నియమిస్తూ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఎస్‌ఎం సాధిక్‌ హుస్సేన్‌ను స్టేట్‌ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా, జిల్లా బీసీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా సీనేపి మునేశ్వరరావు, రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్‌ టీయూసీ ప్రెసిడెంట్‌గా దాది గౌరీశంకర్‌, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గానికి చెందిన జిల్లా యాక్టివిటీ సెక్రటరీగా డాకే శ్రీను, జిల్లా బీసీ సెల్‌ సెక్రటరీగా అయినవిల్లి నాగ సత్య ప్రసాద్‌, జిల్లా మహిళా విభాగం సెక్రటరీగా వెలగన కళ్యాణి రెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఆరో డివిజన్‌ ప్రెసిడెంట్‌గా నల్ల రామాంజనేయులు, 24వ డివిజన్‌ ప్రెసిడెంట్‌గా వై. శ్రీనివాసరావు, 25వ డివిజన్‌ ప్రెసిడెంట్‌గా రొక్కం త్రినాథ్‌, 50 డివిజన్‌ ప్రెసిడెంట్‌గా గుత్తుల కోటీశ్వరిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement