● 3వ తరగతి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష
● ఉమ్మడి జిల్లాలో 21 పాఠశాలల ఎంపిక
● 16,17,18 తేదీల్లో పరీక్ష
రాయవరం: ప్రాథమిక స్థాయి విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు ఎంత వరకు సాధించారు? భాషపై, గణితంలోని చతుర్విధ ప్రక్రియలపై ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారు? అనే విషయాలను తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఢిల్లీలోని ఫరఖ్ (ఫెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్), ఎన్‌సీఈఆర్‌టీ ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషన్ లెర్నింగ్ సర్వే) నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 పాఠశాలలను ఎంపిక చేశారు.
ఒక్కో పాఠశాల నుంచీ 12 మంది
ముఖ్యంగా 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు, అవగాహన నైపుణ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే నిర్వహించనున్నారు. ఎంపికై న ఒక్కో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 12 మందిని మాత్రమే సర్వే చేస్తారు. రోజుకు ఆరుగురు వంతున రెండు రోజులు ఈ పరీక్ష నిర్వహిస్తారు. రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాకుంటే మూడవ రోజు కూడా నిర్వహిస్తారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈ సర్వే ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహిస్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నాలుగు పాఠశాలలు, తూర్పుగోదావరి జిల్లాలో 11, కాకినాడ జిల్లాలో ఆరు పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్) ఈ పరీక్షను పర్యవేక్షిస్తుంది.
ఛాత్రోపాధ్యాయులే ఇన్వెస్టిగేటర్లుగా..
ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పడిపోతున్న పరిస్థితుల్లో ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యుమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్)లో భాగంగా ఈ సర్వే చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్ష నిర్వహణ నిమిత్తం ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు (ఎఫ్‌ఐ)గా నియమించారు. పరీక్ష నిర్వహణపై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఎఫ్‌ఐలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సర్వే నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలోని భాష, గణితం ప్రశ్నలకు సంబంధించిన స్పందనలను ట్యాబ్‌లో నిర్ణీత విధానంలో నమోదు చేస్తారు.
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 25,000
గటగట (వెయ్యి) 22,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 24,000
గటగట (వెయ్యి) 21,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000
కిలో 350
డిజిటల్ విధానంలో..
ఎంపికై న పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను డిజిటల్ విధానంలో పరీక్షిస్తాం.
– పి.నాగేశ్వరరావు, డీఈవో,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అభ్యసన సామర్థ్యాలను
అంచనా వేసేందుకే..
నిపుణ్ భారత్‌లో భాగంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తున్నాం. పబ్లిక్ పరీక్ష మాదిరిగానే దీన్ని నిర్వహించాలి.
– జి.నాగమణి, ఆర్‌జేడీ,
పాఠశాల విద్యాశాఖ, కాకినాడ


