జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో నాగబాబు సత్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో నాగబాబు సత్తా

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

జపాన్‌ ప్రపంచ మీట్‌కు ఎంపిక

కరప: ఢిల్లీలోని ఈస్ట్‌ వినోద్‌ నగర్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో అడ్వెంచర్‌ నేషనల్‌ మాస్టర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ ఓపెన్‌ చాంపియన్‌ షిప్‌లో కాకినాడ జిల్లాకు చెందిన అథ్లెట్‌, ప్రస్తుత భీమవరం జిల్లా ఉప మలేరియా అధికారి యాతం నాగబాబు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ పోటీల్లో ఆయన మొత్తం మూడు పతకాలను కై వసం చేసుకుని తన సత్తా చాటారు.

పతకాల పంట

నాగబాబు 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, 1500 మీటర్ల విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించగా, 400 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో 2027 మే నెలలో జపాన్‌ లో జరగనున్న ’ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌’కు ఆయన ఎంపికయ్యారు.

రికార్డు స్థాయిలో పతకాలు

నాగబాబు ఇప్పటివరకు తన క్రీడా జీవితంలో మొత్తం 105 పతకాలను సాధించి రికార్డు సృష్టించారు. వీటిలో

● జాతీయ స్థాయిలో 63 పతకాలు (21 బంగారం, 17 వెండి, 25 కాంస్యం)

● అంతర్జాతీయ స్థాయిలో 2 స్వర్ణ పతకాలు

● రాష్ట్ర స్థాయిలో 40 పతకాలు ఉన్నాయి

Advertisement
 
Advertisement
Advertisement