ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

ప్రేమ పెళ్లికి కులం అడ్డురావడంతో మనస్తాపం

కాపవరంలో ఘటన

కోరుకొండ: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు కులం కారణంగా అతడి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోరుకొండ మండలం కాపవరంలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్సై ఆర్‌.అంకారావు తెలిపిన వివరాల ప్రకారం.. గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన ఆకాశపు నందిని (19)కి గోకవరానికి చెందిన ఇంటి హేమంత్‌ రామకృష్ణతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నందినితో పెళ్లికి రామకృష్ణ తరఫు పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన నందిని కామరాజుపేట నుంచి కాపవరంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే శనివారం ఉదయం ఆమె ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అమ్మమ్మ కంగారు పడింది. స్థానికుల సాయంతో తలుపులు తీసి చూసి చూడగా.. నందిని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై ఆర్‌.అంకారావు, సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. నార్త్‌ జోన్‌ ఇన్‌చార్జి డీఎస్పీ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement