మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో నాగబాబు ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో నాగబాబు ప్రతిభ

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

సామర్లకోట: ఢిల్లీలో ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకూ జరిగిన నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌ చాంపియన్‌ షిష్‌లో సామర్లకోట్లకు చెందిన యాతం నాగబాబు ప్రతిభ చూపి, మూడు పతకాలు సాధించాడు. 800, 1500 మీటర్ల పరుగు పందేల్లో బంగారు పతకాలు, 400 మీటర్ల పందెంలో వెండి పతకం గెలుచుకున్నాడు. ఈ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 1,200 క్రీడాకారులు హాజరయ్యారు. ఇప్పటికే 63 పతకాలు సాధించిన ఆయన ఢిల్లీలో గెలుచుకున్న వాటితో 65 పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సామర్లకోటకు చెందిన 55 ఏళ్ల నాగబాబు ప్రస్తుతం భీమవరంలో జిల్లా మలేరియా విభాగంలో పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement