ప్రకాశం నగర్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి వివిధ క్రీడా విభాగాల్లో ప్రవేశాల ఎంపికను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డీఎంఎం శేషగిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్లు పైబడి, 19 ఏళ్లలోపు క్రీడాకారులు జనవరి ఒకటో తేదీ 2008 నుంచి జనవరి ఒకటి, 2011 మధ్య జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ, వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. అసక్తి గల అభ్యర్థులు శాప్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు నాగేంద్రన్ 90329 34038 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.


