చింతూరు: చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను రాష్ట్ర బాలల కమిషన్ సభ్యులు గాంధీబాబు శుక్రవారం సందర్శించారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు సీహెచ్‌సీలో అందిస్తున్న సేవలను సమీక్షించారు. పర్యటనలో భాగంగా ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం, పోషకాహార పునరావాస కేంద్రం సేవలపై ఆరా తీశారు. సూపరింటిండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పలు అంశాలపై సమీక్షించారు. పోషకాహారలోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారిని పోషకాహార పునరావాస కేంద్రానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ జిల్లా ప్రోజెక్టు డైరెక్టర్ ఉమాకు సూచించారు. అనంతరం తక్కువ బరువుతో జన్మించిన ఓ శిశువును పరిశీలించారు. ఎస్‌ఎన్‌సీయూ మెడికల్ ఆఫీసర్ మహేష్ ఆసుపత్రి ద్వారా అందజేస్తున్న సేవలను వివరించారు. ఆయన వెంట సీడీపీఓ జయలక్ష్మి, వైద్యులు మహేష్, స్పందన, శివ, రమణారావు, శశికళ, దివ్య, జలవతి, భరద్వాజ్ తదితరులు ఉన్నారు.


