రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

నాగాలాండ్‌ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో అక్రమంగా

నిర్వహణ

పోలీసు స్టేషన్‌కు తరలింపు

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): ఇటీవల ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులు తరచుగా ప్రమాదాలకు గురౌతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా రవాణాశాఖాధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. డ్రైవ్‌లో భాగంగా ఆల్‌ ఇండియా టూరిస్ట్‌ పర్మిట్‌తో నాగాలాండ్‌ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న రెండు స్లీపర్‌ బస్సులను సీజ్‌ చేసి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తరలించారు. బస్సుకు ఉండాల్సిన ఇంధన ట్యాంకర్‌ కంటే అదనంగా మరో ట్యాంకర్‌ ఏర్పాటు చేసి యానాంలో డీజిల్‌ రూ.10 తక్కువగా ఉండడంతో అక్కడ ఇంధనం నింపుకొంటున్నారని రవాణా అధికారులు గుర్తించారు. ఇలా అధిక ట్యాంకులు ఉండటం వల్లే త్వరగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ప్రతి ట్రావెల్‌ బస్సు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డీటీసీ శ్రీధర్‌ అదేశించారు. ఈ డ్రైవ్‌లో ఏఏంవీఐలు మత్సా కళాజ్యోతి, గౌరశంకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement