త్రిరత్న బుద్ధ విహార్‌ అపురూపం | - | Sakshi
Sakshi News home page

త్రిరత్న బుద్ధ విహార్‌ అపురూపం

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

అమలాపురం రూరల్‌: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బౌద్ధ పరిమళాలు విరజిమ్ముతున్న త్రిరత్న బుద్ధ విహార్‌ ఒక అపురూప ఆధ్యాత్మిక కేంద్రమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు భీమారావు యశ్వంత్‌ అంబేడ్కర్‌ అన్నారు. కోనసీమ పర్యటనకు వచ్చిన ఆయన అమలాపురంలో శ్రీరత్న బుద్ధవిహార్‌ను గురువారం సందర్శించారు. తొలుత తాత అంబేడ్కర్‌ నిలువెత్తు విగ్రహానికి వ్యవస్థాపకులు, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. యశ్వంత్‌ అంబేడ్కర్‌కు పంచశీల కండువా మెడలో వేసి గొల్లపల్లి స్వాగతం పలికారు. బుద్ధ విహార్‌ లైబ్రరీని యశ్వంత్‌ అంబేడ్కర్‌ పరిశీలించారు. బుద్ధ విహార్‌ నిర్మాణం గురించి వ్యవస్థాపకులు గొల్లపల్లిని అడిగి తెలుసుకున్నారు. కోనసీమలో బౌద్ధమత ప్రచారం చేస్తున్న గొల్లపల్లిని అభినందించారు. తాను ఇప్పటివరకు ఇంత అద్భుతమైన బుద్ధ విహార్‌ను, బుద్ధుని విగ్రహాన్ని చూడలేదన్నారు. అనంతరం బుద్ధుని విగ్రహం వద్ద బౌద్ధ వందనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. సెక్రటరీ జనరల్‌ డీబీ లోక్‌, చైర్మన్‌ నాగ బత్తుల ప్రసాదరావు, ప్రతినిధులు జంగా బాబురావు, ఎంఏకే భీమారావు, పినిపే సత్యనారాయణ, గెడ్డం సురేష్‌బాబు కోడూరు రామ్మూర్తి, కాశి వెంకట్రావు, సాపే సత్యనారాయణ, దోనిపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌

మనవడు భీమారావు యశ్వంత్‌ అంబేద్కర్‌

Advertisement
 
Advertisement
Advertisement