‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం

Mar 19 2026 7:53 AM | Updated on Mar 19 2026 7:53 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం స్థానిక హైటెక్‌ బస్టాండ్‌ వద్ద కలెక్టర్‌ కీర్తి చేకూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నుంచి కలెక్టరేట్‌ వరకూ రుడా చైర్మన్‌ బొడ్డు వెంకట రమణ చౌదరి, దివ్యాంగులతో కలిసి ఆమె ప్రయాణించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కీర్తి చేకూరి, జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ తదితరులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.

ఉగాది పురస్కారాలకు

ఎంపిక

రాజమహేంద్రవరం సిటీ/రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్‌: Æ>çÙ‰ {糿¶æ$™èlÓ… Hsê {ç³MýSsìæ…^ól EV>¨ ç³#Æý‡ÝëP-Æ>-ÌSMýS$ hÌêÏMýS$ ^ðl…¨¯]l ç³Ë$-Ð]l#Æý‡$ G…í³-MýS-Ķæ*ÅÆý‡$. Ñf-Ķæ$-Ðé-yýlÌZ VýS$Æý‡$-ÐéÆý‡… fÇVóS M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ ÒÇMìS AÐéÆý‡$zË$ {ç³§é¯]l… ^ólÝë¢Æý‡$. ÒÇÌZ Æ>f-Ð]l$-õßæ…-{§ýlÐ]l-Æ>-°MìS ^ðl…¨¯]l _{™èl-M>-Æý‡$yýl$ ™éyøk çßæÇ-MýS–çÙ~, ïܰĶæ$ÆŠ‡ M>Æý‡*t-°‹Üt Ð]l…VýSÌS ÔóæQÆŠ‡, Ýëíßæ¡-Ðól™èl¢ MýSÑ™é {ç³Ýë§Šæ, Æý‡…VýS…-õ³-rMýS$ ^ðl…¨¯]l OòÜMýS™èl ÕË$µË$ Ýùíßæ™èl, «§ýl¯]lÅ™èl (§ólѯ]l íÜçÜtÆŠ‡Þ) E¯é²Æý‡$. ˘

డెల్టాలకు నీరు విడుదల

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు బుధవారం 11,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనిలో గోదావరి తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 2,200, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బుధవారం సాయంత్రానికి కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.25 అడుగులు ఉంది.

ప్రభుత్వాసుపత్రి

ఆర్‌ఎంఓగా ప్రణవ్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఆర్‌ఎంఓగా డాక్టర్‌ ప్రణవ్‌ను నియమిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కెనడీ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ ఆర్‌వీ సుబ్బారావును విధుల నుంచి తొలగించారు. ఆసుపత్రిలో పలు అవకతవకల కారణంగా సుబ్బారావును ఆర్‌ఎంఓ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్‌ ఉత్తర్వులతో డాక్టర్‌ ప్రణవ్‌ ఆర్‌ఎంఓగా విధుల్లో చేరారు.

చెక్‌ పోస్టుల ఏర్పాటు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో మూడు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ షణ్మోహన్‌ బుధవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 9 వరకూ 24 గంటలూ రొటేషన్‌ పద్ధతిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ చెక్‌పోస్ట్‌లు పనిచేస్తాయన్నారు. రెవెన్యూ, ఎకై ్సజ్‌, కమర్షియల్‌ టాక్స్‌ అధికారులను మల్లవరం, నీలపల్లి, సుంకరపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులు వద్ద నియమించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement