రాంగ్ రూట్ తెచ్చిన ముప్పు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● జాతీయ రహదారిపై ఘటన
దేవరపల్లి: రాంగ్ రూటే ముప్పు తెచ్చింది.. ఇద్దరి ప్రాణాలను హరించింది.. గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో యాదవోలు రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం సుబ్బరాయపురం గ్రామానికి చెందిన ముప్పాల రాజశివకృష్ణ (24), అదే గ్రామానికి చెందిన పెనుమాక చిన్నారి (34) బైక్‌పై కొరుకొండ మండలం గోకవరం శివారు కృష్ణుడుపాలెం వెళ్లి శనివారం తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదవోలు రోడ్డు వద్ద హైవేపై శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఏలూరు వైపు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న బొలెరో కారును ముప్పాల రాజశివకృష్ణ రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొన్నాడు. రాజశివకృష్ణ, చిన్నారి అక్కడకక్కడే మృతి చెందారు. మృతుడి తల్లి శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతురాలు చిన్నారికి వివాహం కాగా, రాజశివకృష్ణకు వివాహం కాలేదని ఆయన చెప్పారు. రాంగ్ రూట్‌లో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ఆయన వివరించారు.
రాంగ్ రూట్ తెచ్చిన ముప్పు


