
ఫార్మా – అకడమిక్‌లతో స్థిరమైన అభివృద్ధి
రాజానగరం: ఔషధ పరిశ్రమ ఆవిష్కరణలపై అభివృద్ధి చెందుతుందని, పరిశోధన సామాజిక అవసరాలను తీర్చినప్పుడు విద్యారంగం ఔచిత్యాన్ని పొందుతుందని, ఫార్మా – అకడమిక్ ఈ రెండు స్థిరమైన అభివృద్ధికి అవసరమని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ‘ఫార్మా – అకడమిక్ సినర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ అనే అంశంపై గురువారం వర్సిటీలో ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ జరిగింది. స్థిరమైన ఆవిష్కరణలను పెంపొందించడానికి ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, విద్యా పరిశోధన కలిసే అత్యాధునిక అవకాశాలు, సహకార మార్గాలను కనుగొనవచ్చన్నారు. ఇటువంటి వర్క్‌షాప్‌లను అంతరాలను తగ్గించడం, అర్థవంతమైన సంభాషణ లక్ష్యంగా నిర్వహించాలన్నారు. అమెరికా నుంచి ఫార్మాస్యూటికల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి ఆన్‌లైన్‌లో ‘ఫార్మా అకడమిక్ సినర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సదస్సుకు కన్వీనర్‌గా డాక్టర్ బి. జగన్‌మోహన్‌రెడ్డి, కోకన్వీనర్‌గా డాక్టర్ కె.దీప్తి వ్యవహరించారు.