రంగా అభిమానులపై కూటమి దౌర్జన్యం దారుణం | - | Sakshi
Sakshi News home page

రంగా అభిమానులపై కూటమి దౌర్జన్యం దారుణం

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

ఉప్పలగుప్తం: జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రంగా అభిమానులపై కూటమి ప్రభుత్వ నాయకుల కనుసన్నల్లో పోలీసులు లాఠీచార్జి చేస్తూ దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, కాపు సంఘ నాయకుడు సలాది సతీష్‌ అన్నారు. వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి తొలగించడం, అక్కడి యువకులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కొంతకాలంగా రంగా విగ్రహ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థిస్తున్నా వారికి అనుమతి ఇవ్వడంలో కూటమి నేతలు బెట్టు చూపించారన్నారు. దీనిపై శనివారం ఘటనాస్థలికి వచ్చిన రంగా కుమార్తె ఆశాకిరణ్‌పై సైతం పోలీసులు విరుచుకుపడిన తీరు దారుణమన్నారు. ఆశాకిరణ్‌కు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, రంగా విగ్రహాన్ని అభిమానులు చూపించిన స్థానంలో ఏర్పాటు చేయాలని సతీష్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement