నేడు వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన | - | Sakshi
Sakshi News home page

నేడు వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

రాజమహేంద్రవరం రూరల్‌: వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన జోన్‌–2 ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల బీసీ నాయకుల సమావేశం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరుగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్‌యాదవ్‌ తెలిపారు. శనివారం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరవుతారని, మేధావులు, న్యాయవాదులు, వైద్యులు, బీసీ నేతలంతా హాజరై విజయవంతం చేయాలని చెల్లుబోయిన వేణు, రాచపల్లి రమేష్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement