ఫ అక్రమ మద్యం కేసు పేరుతో కొట్టి, బెదిరించారు
ఫ బీరువాలో బంగారం, నగదు, కీలక పత్రాలు తీసుకుపోయారు
ఫ పీజీఆర్‌ఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు
అమలాపురం రూరల్: అక్రమ మద్యం కేసు పేరుతో ఎకై ్సజ్ అధికారులు తనపై దౌర్జన్యం చేశారని, కొట్టి, బెదిరించారని, బీరువాలోని బంగారం, నగదు, కీలక పత్రాలు తీసుకుపోయారని ఆరోపిస్తూ ఓ మహిళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ వద్ద బాధితురాలు ముషిని హేమలత విలేకర్లకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమె అల్లుడు సంసాని బాలాజీ అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో రత్నం వైన్‌షాపు పేరిట ప్రభుత్వ లైసెన్సుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ షాపుపై ఎకై ్సజ్ అధికారులు ఇటీవల అక్రమ మద్యం కేసు నమోదు చేసి, సీజ్ చేశారు. ఇదిలా ఉండగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హేమలత హైదరాబాద్ నుంచి కుమార్తె ఇంటికి మాగాం వచ్చారు. షాపును అధికారులు సీజ్ చేయడంతో కుమార్తె, అల్లుడు విశాఖపట్నం వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న కుక్కను చూసుకునేందుకు హేమలత మాగాంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో దాదాపు తొమ్మిది మంది పోలీసులు, ఎకై ్సజ్ సిబ్బంది ఆ ఇంటికి వచ్చారు. తన అల్లుడు బాలాజీ ఎక్కడున్నాడో చెప్పాలంటూ హేమలతను ప్రశ్నించారు. శ్రీవిశాఖపట్నం వెళ్లారని, అంతకు మించి నాకు తెలియదని చెప్పినా వినకుండా గొంతు పట్టుకుని బయటకు లాగి పడేశారు. చెంపపై కొట్టడంతో పాటు తీవ్రంగా వేధించారు. అల్లుడు ఎక్కడున్నాడో చెప్పకపోతే నన్ను, నా కొడుకును కేసులో ఇరికించి, రిమాండుకు పంపిస్తామంటూ బెదిరించారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకూ నన్ను మానసికంగా, శారీరకంగా వేధించారు. కింద పడిపోతే కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. బీరువా తాళాలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. తాళాలు ఎక్కడున్నాయో తనకు తెలియదని చెప్పినా వారే బీరువాలు తెరిచారు. అందులో ఉన్న వైన్‌షాపు, భూములకు సంబంధించిన పత్రాలు, స్టాంప్ పేపర్లు, బంగారు ఆభరణాలు, సుమారు రూ.నాలుగైదు లక్షల నగదు తీసుకెళ్లారు. ఇంట్లో దొరికాయంటూ కొన్ని పత్రాలు, వస్తువులను కవర్లలో పెట్టి, వాటిపై బలవంతంగా నా సంతకాలు తీసుకున్నారు. నేను చదువుకోలేదు. తెల్ల కాగితాలపై ఏమి రాశారో నాకు తెలియదు. అయినప్పటికీ సుమారు ఐదుచోట్ల సంతకాలు తీసుకున్నారు. నాపై ఎలాంటి వేధింపులూ జరగలేదని చెప్పేలా వీడియోలో నవ్వుతూ మాట్లాడాలని ఒత్తిడి చేశారు. తాను తీవ్ర నొప్పులతో నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ వీడియో తీసేందుకు ప్రయత్నించారుశ్రీ అని హేమలత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన అల్లుడు లైసెన్స్‌తోనే వైన్‌షాపు నిర్వహిస్తున్నాడని, అక్రమ మద్యం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఆమె స్పష్టం చేశారు. తనపై జరిగిన దౌర్జన్యంపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు.


