మామిడికుదురు: హైదరాబాద్‌లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ 2026 పోటీల్లో మాకనపాలెం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు పతకాలు కొల్లగొట్టారు. కరాటే కుంగ్ ఫూ వెపన్ విభాగంలో నాలుగో తరగతి విద్యార్థి మద్దాల గణకార్తికేయ గోల్డ్ మెడల్, కటాస్ విభాగంలో మూడో తరగతి విద్యార్థిని దక్షజ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అన్న బంగారు పతకం సాధించగా, చెల్లి వెండి పతకం సాధించారు. వీరిని స్థానికులు, స్కూల్ యాజమాన్యాలు సోమవారం ఘనంగా సత్కరించారు. క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ చూపాలని అభిలషించారు.
డీఈవోగా మహబూబ్ బాషా
ముమ్మిడివరం: జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సోమవారం ముమ్మిడివరం డీఈఓ కార్యాలయంలో బాధ్యత లు చేపట్టారు. ఆయన కాకినాడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీ పై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకు డీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన పి.నాగేశ్వరరావు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ–1గా బాఽధ్యతలు నిర్వహించనున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు బాషా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన బాషాను పలువురు అభినందించారు.


