● తగ్గించవలసిందే
● మాజీ ఎంపీ చింతా అనురాధ
అల్లవరం: కంపెనీలు ఫీడ్ ధరలు పెంచడం ఆక్వా రంగానికి గుదిబండగా మారతాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ అన్నారు. అల్లవరం మండలం మొగళ్ళమూరులోని ఆమె నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు ఫీడ్ ధరలు పెంచిందన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా)తో సంబంధం లేకుండా ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా టన్నుకి రూ.8,420, టైగర్ రొయ్యల మేత రూ.10,530 చొప్పున పెంచాయన్నారు. పాలకులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా రొయ్యల ఎగుమతులు నిలిచిపోతే నిర్ణయించిన ధరలకే రొయ్యలను కొనుగోలు చేసేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకొన్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఒక్క రూపాయి పెంచలేదని గుర్తు చేశారు.


