ప్రేమించటం లేదని యువతిపై కత్తి దాడి.. అనంతరం..

Young Man Attacks Young Girl With Knife Over Rejecting His Love - Sakshi

సాక్షి, జగిత్యాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించటం లేదని ఓ యువతిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన జాబితాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడిపల్లి మండలం, మన్నెగూడెంకు చెందిన రాజ్‌ కుమార్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. సదరు యువతి అతడి ప్రేమను అంగీకరించలేదు.

దీంతో పగ పెంచుకున్న రాజ్ కుమార్‌ శనివారం ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలవ్వగా.. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి : ఈపాస్‌ల కోసం ఏకంగా ట్రంప్‌, అమితాబ్‌లను వాడేశారు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top