వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పత్తి చేనులోకి తీసుకెళ్లి | Woman Kills Husband Over Extramarital Affair In Ranga Reddy | Sakshi
Sakshi News home page

Ranga Reddy: వివాహేతర సంబంధం: భర్తను హత్య చేసిన భార్య

Nov 6 2021 4:02 PM | Updated on Nov 6 2021 4:04 PM

Woman Kills Husband Over Extramarital Affair In Ranga Reddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను చంపేసింది. ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన శేఖర్, మాధవి వివాహేతర సంబంధం నెరుపుతున్నారు. ఈవిషయమై వెంకటయ్య పలుమార్లు భార్య మాధవిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.
చదవండి: ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేసి..  నగదు పోగొట్టుకున్న యువతి 

తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగానే అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్‌ పథకం పన్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి పంటలో వెంకటయ్యను చంపేశారు. వెంకటయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.
చదవండి: పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం 

Advertisement
 
Advertisement
Advertisement