
మధ్యాహ్నం బస్సులో ప్రయాణిస్తున్న మహళా కానిస్టేబుల్‌ను అసభ్యంగా తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు. చివరకు అతడిని ఆమె వారించడంతో తలపై హెల్మెట్‌తో కొట్టి గాయపరిచాడు. ఆ తర్వాత..
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితులకు శిక్షపడుతున్నపటికి దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా దేశ రాజధానిలో మిట్ట మధ్యాహ్నం ఓ మహిళా కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురైంది. బస్సులో ప్రయానిస్తుండగా ఓ వ్యక్తి తనని అసభ్యంగా తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళా కానిస్టేబుల్(29) బుధవారం విధులకు బస్సులో బయలుదేరింది. రద్దీగా ఉన్న బస్సులో ఆమె పక్కనే ఓ వ్యక్తి నిలుచుని ఉన్నాడు.
ఈ క్రమంలో ఆ వ్యక్తిని తనని అసభ్యంగా తాకడం ఆమె గమనించింది. మొదట అనుకొకుండా తాకడేమో అనుకున్న ఆమె అతడిని వదిలేసింది. ఆ తర్వాత కూడా తన మెడ నుంచి వెనక వరకు అసభ్యంగా తాకుతుండంటంతో అతడిని వారించింది. అయినా అతడు వినకుండా ఆమెతో వికృతంగా ప్రవర్తిస్తూ కామవాంఛ తీర్చుకున్నాడు. ఆగ్రహనికి లోనైన ఆ మహిళ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతడిని బెదరించింది. అయినా ఈ ప్రబుద్ధుడు బయటపడలేదు. అందరూ చూస్తుండగానే బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. అయినా చూట్టూ ఉన్న జనం ఎవరూ కూడా నిందితుడి వారించేందుకు ప్రయత్నించలేదు.
చివరకు బాధితురాలు అతడిని పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించగా నిందితుడు హల్మెట్‌తో కానిస్టేబుల్ తలపై కొట్టాడు. దీంతో బాధితురాలి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపులు, ఇతర కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్తితి నిలకడ ఉందని, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
చదవండి:
హవ్వ! ఈ కారణంతో కూడా పెళ్లి ఆపేస్తారా?
కారు బాంబ్ పేలుడు.. 20 మంది మృతి