తాగుబోతుల వీరంగం, అడ్డుకున్నందుకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లపై | Two Drinkers Attacks On Police Constables At Koheda Siddipet District | Sakshi
Sakshi News home page

గొడవ ఆపండ్రా బాబు అన్నందుకు పోలీసులపై కర్రతో దాడి

Apr 3 2021 8:35 AM | Updated on Apr 3 2021 12:06 PM

Two Drinkers Attacks On Police Constables At Koheda Siddipet District - Sakshi

సాక్షి, సిద్దిపేట: మద్యం మత్తులో ఇద్దరు యువకులు సిద్దిపేట జిల్లాలో వీరంగం సృష్టించారు. కోహెడ మండల కేంద్రంలో కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు. దాడిలో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ తలకు రక్త గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కోహెడ పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు గొడవ పడుతుండగా స్థానికులు 100 కు ఫోన్ చేశారు. ‌

వెంటనే బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ మరో కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు యువకులు సజ్జు, ఉమేగ్‌లను వారించే ప్రయత్నం చేయగా తిరగబడ్డ ఇద్దరు యువకులు కానిస్టేబుళ్లపై దాడికి తెగబడ్డారు. కర్ర తో దాడికి దిగడంతో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement