విశాఖ: బాలుడు అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు | Turning Point In Boy Teja Suspicious Death Case In Visakha | Sakshi
Sakshi News home page

విశాఖ: బాలుడు అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు

Jun 18 2023 1:27 PM | Updated on Jun 18 2023 1:46 PM

Turning Point In Boy Teja Suspicious Death Case In Visakha - Sakshi

ఐదేళ్ల బాలుడు తేజ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. పెందుర్తి లెండి వనంలోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు మృతి చెందిన తర్వాత ఓనర్ భాను కుమార్‌కు వాచ్‌మెన్‌ సత్యనారాయణ సమాచారం ఇచ్చాడు.

సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల బాలుడు తేజ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. పెందుర్తి లెండి వనంలోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు మృతి చెందిన తర్వాత ఓనర్ భాను కుమార్‌కు వాచ్‌మెన్‌ సత్యనారాయణ సమాచారం ఇచ్చాడు.

లెండి వనం నిర్మాణం సమయంలో స్థానిక టీడీపీ నేత బండారి సత్యనారాయణతో కలసి ఓ స్థలం కబ్జాకు యత్నించిన ఓనర్ భాను కుమార్.. లెండి వనం రిసార్ట్‌కి పక్కనే ఉన్న స్థలంపై కన్ను ఉండటంతో  బాలుడు మృత దేహాన్ని ఆ స్థలంలో పడేయాలని  ఆదేశించాడు. ఓనర్ చెప్పినట్టు ఆ బాలుడు మృత దేహాన్ని రాత్రి సమయంలో ఎవరు చూడకుండా పనస చెట్టు వద్ద వాచ్‌మెన్‌ పడేశాడు.

ఆ విధంగా మృతదేహం పడేస్తే స్థలం యజమాని తక్కువ రేటుకి అమ్మకం జరుపుతారనే ఆలోచన పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వాచ్‌మెన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిసార్ట్ ఓనర్ భానుకుమార్ హైదరాబాద్‌లో ఉండటంతో విశాఖకి రప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement