అనుమానం వచ్చింది.. అంతే వాళ్లని చెట్టుకు కట్టేసి.. | Telangana: Villagers Attacked Family Under Pretext Witchcraft Sangareddy | Sakshi
Sakshi News home page

అనుమానం వచ్చింది.. అంతే వాళ్లని చెట్టుకు కట్టేసి..

Jun 18 2023 8:55 AM | Updated on Jun 18 2023 9:04 AM

Telangana: Villagers Attacked Family Under Pretext Witchcraft Sangareddy - Sakshi

సదాశివపేటరూరల్‌ (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కొల్కూర్‌ గ్రామంలో మంత్రాల(చేతబడి) నెపంతో గ్రామస్తులు శనివారం ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. సదాశివపేట సీఐ నవీన్‌ కుమా ర్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ముత్తంగి యాదయ్య కుటుంబం చేతబడి చేస్తోందనే అనుమానంతో గ్రామానికి చెందిన శివ య్య, లక్ష్మణ్, కోవూరి కుమార్, గడ్డం పెంటయ్య, బాగప్ప, బెగరి కుమార్, గడ్డం శ్యామల, గడ్డం ఆగమ్మ తదితరులు కలిసి యాదయ్య కుటుంబాన్ని తాళ్లతో చెట్టుకు కట్టేసి కట్టెలతో దాడి చేశారు.

కొందరు గ్రామస్తులు నిలువరించడంతో యాదయ్య, ఆయన భార్య అమృత, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దళితులపై మంత్రాలనెపంతో దా డి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్, జిల్లా అధ్యక్షుడు అశోక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చదవండి: బంజారాహిల్స్‌: మసాజ్‌ చేస్తూ గొలుసు కొట్టేశారు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement