తహసీల్దార్‌ కంత్రీ వేషాల్.. అమ్మాయిలను లోబరుచుకుని.. వీడియోలు తీసి..

Tehsildar Harassing Women In Anantapur District - Sakshi

మద్యం, మగువ, మనీకే ప్రాధాన్యం 

వీక్లీ పాతిక లక్షల అక్రమార్జన..

వీకెండ్‌ అమ్మాయిలతో టూర్‌ 

విలాసవంతమైన జీవితం.. కనిపించని మానవత్వం

పనిచేసిన ప్రతిచోటా ఇవే ఆరోపణలు

తల పట్టుకుంటున్న ఉన్నతాధికారులు

పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసిన ఆర్డీఓ

►ఏదో పనిమీద కార్యాలయానికి వెళ్లిన మహిళపై కన్నేశాడు. అసైన్డ్‌ భూములు రాసిస్తానంటూ ఆశపెట్టాడు. నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ తన అవసరం తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన కింది స్థాయి సిబ్బందికీ ఆమెను అప్పగించాడు. మొత్తంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆ మహిళ పేరుపై పట్టా చేసిచ్చాడు.

►చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన ఓ మహిళను చేరదీశాడు. మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆమె ద్వారా అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి లోబరుచుకున్నాడు.

►దాదాపు 50 ఏళ్లున్న ఆ అధికారి వైద్య ఆరోగ్యశాఖతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. తన బిడ్డల వయస్సున్న కొందరు విద్యార్థుల జీవితాలను బలిచేశాడు. పైగా వారి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ నరకం చూపుతున్నాడు.

►ఇలా...ఎందరో మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ తహసీల్దార్‌ అక్రమార్జనలోనూ ఆరితేరిపోయారు. 

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: మండలానికి మెజిస్ట్రేట్‌.. జవాబుదారీగా ఉండాల్సిన అధికారి దారి తప్పారు. మద్యం, మగువ, మనీ కోసమే ఉద్యోగమంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. వారానికి పాతిక లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నాడు..వీకెండ్‌లో అమ్మాయిలతో బెంగళూరుకు వెళ్లి సేదదీరుతున్నాడు. ఇటీవల ఈ అధికారి అవినీతి అక్రమాలపై ఓ వృద్ధురాలు కలెక్టర్‌ నాగలక్ష్మికి ఫిర్యాదు చేయగా.. ఆమె ఆర్డీఓను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన ఆర్డీఓకు కళ్లుబైర్లుకమ్మే నిజాలు తెలియడంతో ఆయన సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించారు. ఆమె దాన్ని సీసీఎల్‌ఏకు పంపనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. 

చేయి తడపందే పని జరగదు 
గతంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లో పనిచేసిన సదరు తహసీల్దార్‌పై అవినీతి అరోపణలు వెల్లువెత్తాయి. భారీగా ముట్టజెప్పనిదే ఆయన పనిచేయరని బాధితులు గగ్గోలు పెట్టారు. పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సొంత శాఖ ఉద్యోగిపై ప్రేమ చూపిన అధికారులు ఆ తహసీల్దార్‌ను అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గానికి బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన పనితీరు మార్చుకోలేదు. పాత రూటులోనే వెళ్తూ భారీగా వెనకేసుకున్నారు. సంవత్సరం వ్యవధిలోనే 350 మ్యుటేషన్లు చేశారు. ఇందులో 23 అనధికారికంగా చేసినట్లు విచారణలో తేలింది. ఏకంగా రూ.6 కోట్లు చేతులు మారినట్లు సమాచారం.

అనంతపురం అశోక్‌నగర్‌లో  రూ.1.50 కోట్లు విలువైన భవనంలో ఉంటున్న సదరు అధికారి...సమీపంలో ఉన్న రూ.2 కోట్ల బిల్డింగ్‌ కొనుగోలుకు రూ.50 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చినట్లు తెలిసింది. మరో అపార్టుమెంట్‌ కూడా బినామీల పేరుతో కొనుగోలు చేసి ఆధునికీకరణ పనులు చేయిస్తున్న సమాచారం. 
బెంగళూరులో ఆరు అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.  
ఇటీవలే కాలువపల్లి సమీపంలో 30 ఎకరాల దానిమ్మతోట కొనుగోలు చేసినట్లు అధికారులే గుర్తించారు.

అందరినీ ఏకం చేసి... 
తాను పనిచేసే మండల కేంద్రంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులను చేరదీసి దందాలకు దిగాడు. ఒక ఆర్‌ఎస్‌ఐ, వీఆర్‌ఓ, ఆర్‌ఐలతో జట్టుకట్టి భూ వివాదాలకు తెరతీశారు. రైతులు తమకు జరిగిన అన్యాయంపై నోరు మెదపాలని చూస్తే ఓ వైపు పోలీసులను, మరో వైపు రెవెన్యూ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దారికి తెచ్చుకుంటున్నారు.

వీడియో కాల్స్‌తో...  
భారీగా ఆర్జిస్తున్న సదరు తహసీల్దార్‌కు అమ్మాయిలపై వ్యామోహం ఎక్కువ. పైగా ఉదయం 11 గంటల నుంచి మద్యం మత్తులో ఉంటాడని అధికారులే చెబుతున్నారు. కార్యాలయంలో గంట కూడా ఉండని ఆయన...ఆ తర్వాత తన మండల పరిధిలోనే ఓ గదిలో మహిళలతో కలిసి రాచకార్యాలు వెలగబెడుతుంటారని చెబుతున్నారు. యువతులకు డబ్బు ఎరవేసి బలితీసుకునే సదరు అధికారి తనకు నచ్చిన యువతి... ముందుగా వీడియో కాల్‌లో నగ్నంగా చూడాలని షరతు పెడతాడు.

ఆ తర్వాతే ఆమెతో గడుపుతాడు. నచ్చితే తనతో పాటు కారులో తీసుకెళతాడు. అనంతపురం నగరంలోని మూడ నక్షత్రాల హోటల్‌లో ఆయన బస చేస్తారని తెలుస్తోంది.  ఇలా కొందరితో సదరు తహసీల్దార్‌ చేసిన వీడియో చాట్‌లు ఇప్పుడు బహిర్గతం కాగా, ఉన్నతాధికారులు వాటిని కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top