సుశాంత్ కేసు : ఎన్‌సీబీ అధికారికి పాజిటివ్

Sushant Case: Shruti Modi questioning stopped as NCB member tests positive - Sakshi

అర్ధాంతరంగా  నిలిచిన విచారణ

మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీ వెనక్కి

సాక్షి, న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణకు కరోనా సెగ తాకింది. ఎన్‌సీబీ దర్యాప్తు బృందంలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో విచారణను అర్దాంతరంగా నిలిపివేశారు అధికారులు.  నిర్దేశించిన ప్రోటోకాల్  ప్రకారం ఇతర సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి చర్యల అనంతరం మళ్లీ దర్యాప్తు మొదలుకానుందని ఎన్‌సీబీ సీనియర్ అధికారి  తెలిపారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) బృంద సభ్యుల్లో ఒకరికి బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీని ప్రశ్నించడం అకస్మాత్తుగా ఆగిపోయింది. శ్రుతి మోడీని దర్యాప్తును ప్రస్తుతానికి నిలిపివేశామని, ఆమెను తిరిగి పంపించామని  ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోడీతోపాటు, టాలెంట్ మేనేజర్ జయ సాహా పేర్లు బహిర్గతమైన తరువాత ఎన్‌సీబీ వీరిపై దృష్టి పెట్టింది. వీరిని ప్రశ్నించేందుకు బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రుతి దక్షిణ ముంబైలోని ఎన్‌సీబీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. కానీ తాజా పరిణామంతో ఈమెతోపాటు, సాహా విచారణ కూడా ప్రస్తుతానికి వాయిదా పడింది. (డ్రగ్స్‌ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్‌)

కాగా జూన్14న సుశాంత్ అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుకు సంబంధించి అనేక కీలక పరిణామాల మధ్య డ్రగ్స్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు  రియాపై ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియా చక్రవర్తి,  ఆమె సోదరుడు షోయిక్, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా  సహా పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-09-2020
Sep 25, 2020, 08:10 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఏ ఒక్కరినీ...
25-09-2020
Sep 25, 2020, 06:51 IST
సాక్షి, సిటీబ్యూరో : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ డీన్‌ శ్రీనివాస్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. నకిలీ ఈ–మెయిల్‌...
25-09-2020
Sep 25, 2020, 05:26 IST
ముంబై: ఇంటి నుంచి విధులు నిర్వర్తించే (వర్క్‌ ఫ్రం హోమ్‌) సంస్కృతి బాగా పని చేసిందని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌...
24-09-2020
Sep 24, 2020, 15:33 IST
న్యూఢిల్లీ: కరోనాతో ఇటీవల పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. కేంద్రమంత్రి సురేష్ అంగడి బుధవారం కరోనాతో మృతి చెందగా ఆయన...
24-09-2020
Sep 24, 2020, 14:31 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు...
24-09-2020
Sep 24, 2020, 12:43 IST
చెన్నై : తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు తేలింది. దీంతో చెన్నైలోని మియోట్‌...
24-09-2020
Sep 24, 2020, 09:44 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 57 లక్షలు దాటాయి. గురువారం కొత్తగా 86,508 కేసులు నమోదు అయ్యాయి....
24-09-2020
Sep 24, 2020, 08:21 IST
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ మరో నటుడిని...
24-09-2020
Sep 24, 2020, 08:21 IST
న్యూయార్క్‌ : ప్రముఖ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్‌...
24-09-2020
Sep 24, 2020, 06:12 IST
సాక్షి, అమరావతి: ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 53,02,367 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా 72,838 టెస్టులు చేయగా,...
24-09-2020
Sep 24, 2020, 02:21 IST
ఐక్యరాజ్య సమితి: కరోనా పాపం చైనాదే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి చైనాదే బాధ్యతగా ఐక్యరాజ్య...
23-09-2020
Sep 23, 2020, 22:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2 లక్షల 56 వేలు కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి.  గడచిన 24 గంటలలో...
23-09-2020
Sep 23, 2020, 21:14 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి...
23-09-2020
Sep 23, 2020, 18:10 IST
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా, మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయం.
23-09-2020
Sep 23, 2020, 16:47 IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.
23-09-2020
Sep 23, 2020, 10:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,347  కరోనా పాజిటివ్ కేసులు...
23-09-2020
Sep 23, 2020, 09:21 IST
బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌లోనే తయారయ్యిందంటూ సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌...
23-09-2020
Sep 23, 2020, 09:10 IST
సాక్షి, శ్రీకాకుళం: ఆ యువకుడిది పేద కుటుంబం.. తండ్రి మరణించాడు.. అన్నయ్య, తల్లి కష్టపడి చదివించారు. తాను కూడా ఉపాధ్యాయ...
23-09-2020
Sep 23, 2020, 08:59 IST
హైదరాబాద్ : కోవిడ్‌–19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేయడమే మేలు. ఇదీ భాగ్యనగరిలో ఐటీ,...
23-09-2020
Sep 23, 2020, 05:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వేళ కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడిన విషయం వాస్తవమేనని టాస్క్‌ఫోర్స్‌ నిర్ధారణకు వచ్చినట్లు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top