పని ఒత్తిడితో స్టేషన్‌లోనే అఘాయిత్యం

సాక్షి, న్యూఢిల్లీ: సర్వీస్ రివాల్వర్‌తో సబ్ ఇన్‌స్పెక్టర్ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్. స్టేషన్ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు 2017లో ఎస్సైగా రాహూల్ సింగ్ (31) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్ ఆవరణలోనే తన సర్వీస్ రివాల్వర్‌ను తీసుకుని రాహుల్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్‌లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్‌కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆరోపించింది. స్టేషన్ అధికారి (సీఐ) ఒత్తిడితో తన భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది.
చదవండి: కారులోనే ముగ్గురు సజీవదహనం
చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్