Soujanya Ends Her Life In Warangal District - Sakshi
Sakshi News home page

హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్‌ చేసి.. 

Jun 30 2023 9:53 AM | Updated on Jun 30 2023 10:55 AM

Soujanya Suicide Due To Stranger Video Call Blackmail At Warangal - Sakshi

సాక్షి, వరంగల్: వరంగల్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అపరిచిత వ్యక్తితో పరిచయం కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారు. 

వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన వివాహిత సౌజన్యకు కొద్దిరోజుల క్రితం తిరుపతి అనే వ్యక్తి నుంచి మిస్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తిరిగి కాల్‌ చేయడంతో అనుకోకుండా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే ఈ పరిచయం కాస్తా చనువుగా మారింది. దీంతో, తిరపతి.. సౌజన్యకు తరచుగా కాల్‌ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మాయ మాటలు చెప్పి క్లోజ్‌ అయ్యాక.. వీడియో కాల్స్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. 

అయితే, వీడియో చేసిన తర్వాత థర్డ్‌ పార్టీ అప్లికేషన్స్‌ ద్వారా సౌజన్య ఫోన్‌లోని డేటాను తిరపతి తస్కరించాడు. అనంతరం, వారిద్దరూ చనువుగా మాట్లాడుకున్న వీడియోలను తన భర్తకు, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో, ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇక, ఈ విషయం తన భర్తకు తెలియడంతో సౌజన్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో, నీటి సంపులో దూకి సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సౌజన్య మృతిచెందింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, సౌజన్య ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: విశాఖలో రియల్టర్‌, భార్య కిడ్నాప్‌.. గంటల్లోనే చేధించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement